ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. వైసీపీ అధినేత జగన్ కి సీనియర్స్ నేతల నుంచి ఊహించని షాక్ తగిలింది. చాలా మంది సీనియర్ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న టెన్షన్ లేకుండా.. అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన వారికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపించారు. టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారు వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.