నిన్న గాక మొన్న విధుల్లోకి.. అంతలోనే, ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
నెలల పాటు ఎదురుచూసి.. కోర్టులో న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు విధుల్లో చేరిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. అయితే ఏబీవీని సస్పెండ్ చేసిన కారణం మాత్రం తెలియరాలేదు.
ఇదిలా ఉండగా, ఏబీ వెంకటేశ్వరరావుకు ఇటీవల ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమిస్తూ జూన్ 15, బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏబీవీకి ఈ నిర్ణయంతో ఊరట కలిగినట్లయ్యింది.
#Also REad:ఈ శాఖ పట్ల నాకు పూర్తి అవగాహన లేదు : ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్ ఏబీ వెంకటేశ్వరరావు..
కాగా.. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే, ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయన మీద కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది.
తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తన మీద విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తన మీద విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.
ఆయన ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశం మీద చర్చ జరిగింది. ఈ విషయం మీద హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. కూడా 2019 మే వరకు పెగాసెస్ సహా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు.