అమరావతి:సీనియర్ ఐపీఎస్ అధికారి  ఏబీ వెంకటేశ్వరరావు  దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు వాదనలు పూర్తయ్యాయి. ఇరు వర్గాల వాదనలను విన్న క్యాట్ తీర్పును రిజర్వ్ చేసింది. 

చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ ‌గా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు. ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ కొన్ని పరికరాల కొనుగోలుకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టుగా జగన్ సర్కార్ తేల్చింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేసింది. 

Also read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్: స్టేకు క్యాట్ నిరాకరణ

ఈ సస్పెన్షన్‌ను ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో  ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన సవాల్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే  తనను  సస్పెండ్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు.

తన సస్పెన్షన్‌పై  స్టే విధించాలని  క్యాట్‌ను ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్థించారు. కానీ క్యాట్ మాత్రం ఏబీ వెంకటేశ్వరరావు  మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. ఫిబ్రవరి 14వ తేదీన  స్టే ఇచ్చేందుకు నిరాకరించిన క్యాట్ విచారణను వాయిదా వేసింది. శుక్రవారం నాడు క్యాట్‌లో ఇరువర్గాల వాదనలు ముగిశాయి. తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టింది క్యాట్.