Asianet News TeluguAsianet News Telugu

అచ్చు పుష్ప సినిమానే: బొలెరోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన అల్లూరి పోలీసులు

అల్లూరి సీతారామరాజు  జిల్లాలోని డుంబ్రిగూడ  మండలం కించుమండలలో  బొలేరో  వాహనంలో  తరలిస్తున్న  130  కిలోల  గంజాయిని ఎస్ఈబీ  పోలీసులు  సీజ్  చేశారు.  పుష్ప  సినిమాలో  మాదిరిగా  గంజాయి  తరలించేందుకు  వాహనంలో ప్రత్యేకేంగా  అరను  ఏర్పాటు  చేశారు  నిందితులు. 

SEB officials seized 130 kgs ganja from bolero  vehicle Andhra Pradesh
Author
First Published Nov 27, 2022, 10:20 AM IST

డుంబ్రిగూడ:అల్లూరి  సీతారామరాజు  జిల్లాలో  బొలేరో  వాహనంలో  గంజాయిని అక్రమంగా  తరలిస్తున్న  ఇద్దరిని  పోలీసులు  ఆదివారంనాడు  అరెస్ట్  చేశారు.  పుష్ప  సినిమాలో  హీరో  అల్లు  అర్జున్  కలప  స్మగ్లింగ్ కోసం  వాహనాల్లో  ఏర్పాటు  చేసినట్టుగానే ప్రత్యేక  అరలను  ఏర్పాటు చేసి  గంజాయి  తరలిస్తున్నారు స్మగ్లర్లు. 

అల్లూరి  జిల్లాలోని   డుంబ్రిగూడ  మండలం కించుమండలో ఈ  ఘటన  చోటు  చేసుకుంది.  బొలేరో  వాహనం  టాప్  పైన  ప్రత్యేక  అరను  ఏర్పాటు  చేశారు నిందితులు . బోలేరో వాహనంలో  వెళ్తున్న ఇద్దరిని  ప్రశ్నించిన ఎస్ఈబీ  అధికారులకు  అనుమానం  వచ్చింది.  వీరిని ప్రశ్నించారు.  వీరిద్దరూ  ఇచ్చే  సమాధానాలతో  అధికారులకు  అనుమానాలు  మరింత  బలపడ్డాయి.  దీంతో వాహనాన్ని  క్షుణ్ణంగా  తనిఖీ  చేయించారు.  బొలేరో  వాహనం  టాప్  పై  భాగంలో ప్రత్యేకంగా  అరను  ఎస్ఈబీ  అధికారులు గుర్తించారు. ఈ   అరలో  ప్యాక్ చేసిన  130  కిలోల  గంజాయిని  ఎస్ఈబీ  అధికారులు  గుర్తించారు.  డుంబ్రిగూడకు  చెందిన  కిల్లో  రమేష్, కోరాపూట్ కు చెందిన   పాంగి మహేశ్వర్ ను  అరెస్ట్  చేశారు.  గంజాయిని  ఎస్ఈబీ  అధికారులు సీజ్  చేశారు.

రెండు  తెలుగు  రాష్ట్రాల్లో  గంజాయి సరఫరా చేస్తూ  పోలీసులకు  పట్టుబడిన  ఘటనలు  చోటు  చేసుకున్నాయి.  తూర్పుగోదావరి  జిల్లా  నుండి  ఛత్తీస్‌ఘడ్  కు  గంజాయి తరలిస్తున్న ముఠాను  హైద్రాబాద్  సమీపంలోని  హయత్  నగర్ పోలీసులు  అరెస్ట్  చేశారు. రూ. 2.80 కోట్ల  విలువైన  1300  కిలోల గంజాయిని పోలీసులు  సీజ్ చేశారు.   ఈ  ఘటన  ఈ ఏడాది  అక్టోబర్  6న  చోటు  చేసుకుంది.కొబ్బరి బొండాల మధ్యలో  గంజాయి  బ్యాగులను  సరఫరా చేస్తుండగా  పోలీసులు  నిందితులను  అరెస్ట్  చేశారు. 

గత  ఏడాది  ఏపీ రాష్ట్రంలో  2 లక్షల  కిలోల గంజాయిని స్వాధీనం చేసకున్నట్టుగా  నార్కోటిక్స్  బ్యూరో నివేదిక  తెలిపింది.  ఈ ఏడాది సెప్టెంబర్  మాసంలో  ఈ నివేదిక  విడుదలైంది. ఆంధ్రప్రదేశ్,  ఒడిశా  రాష్ట్రాలు  గంజాయి సరఫరాలో  అగ్రస్థానంలో  ఉన్నట్టుగా ఈ  నివేదిక  తెలిపింది. సైబరాబాద్  పోలీస్ కమిషనరేట్ పరిధిలో   1982  కిలోల  గంజాయిని పోలీసులు  సీజ్  చేశారు. దీని విలువ  రూ. 8  కోట్లు  ఉంటుందని  పోలీసుులు చెప్పారు. ఆంధ్రా, ఒడిశా,  మహరాష్ట్ర,కర్ణాటకల నుండి  గంజాయిని సరఫరా చేస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు. ఈ  ఏడాది  జూలై  19న  నిందితులను  అరెస్ట్  చేసినట్టుగా  సైబరాబాద్  సీపీ స్టీఫెన్  రవీంద్ర  తెలిపారు. 

also read:581 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయి: పోలీసుల సమాధానం.. ప్రూఫ్ ఇవ్వండని కోర్టు ఆదేశం

ఈ  ఏడాది  జూలై  4న   హైద్రాబాద్  సంజీవరెడ్డినగర్  లో   డ్రగ్స్  విక్రయిస్తున్న ముగ్గురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. పుష్ప  సినిమా  తరహలోనే  గంజాయిని  సరఫరా చేస్తున్న  నిందితుడిని  ఈ ఏడాది జూన్  10న  పోలీసులు  అరెస్ట్  చేశారు. ఆగ్రాలో  నిందితుడిని పోలీసులు  అరెస్ట్  చేశారు. నిందితుడు  తరలిస్తున్న  గంజాయిని  సీజ్ చేశారు. నిందితుడు  రూ. 2 కోట్ల విలువైన  గంజాయిని  తరలిస్తుండగా  పోలీసులు  సీజ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios