విజయవాడ: రోడ్డు ప్రమాదానికి గురైన కారు నుంచి సీటు బెల్టు పెట్టుకోవడం వల్లనే యువ హీరో సుధాకర్ బయటపడ్డారు. మిగతా వారంతా కూడా సీటు బెల్టులు పెట్టుకోవడం వల్లనే ప్రాణాలు కాపాడుకోగలిగారు. 

నువ్వు తోపురా సినిమా సిబ్బందితో పాటు హీరో సుధాకర్ కొమకుల, నటి నిత్యా శెట్టి గుంటూరు వెళ్తుండగా శనివారంనాడు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు ఢీకొనడంతో ఓ మహిళ మరణించింది. కారులో వారిద్దరితో పాటు దర్శకుడు హరినాథ్ బాబు, విదేశీ ఎడ్మండ్ ఉన్నారు. వారంతా స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

తమ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాదు నుంచి గుంటూరు వెళ్తుండగా చినకాకాని వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి డివైడర్ పై ఉన్న చెట్లకు కొంత మంది నీరు పెడుతున్న సమయంలో కారు కార్మికురాలిని ఢీకొట్టింది. దీంతో యు. లక్ష్మి అనే 45 ఏళ్ల మహిళ మరణించింది. 

సంబంధిత వార్త

రోడ్డుప్రమాదంలో గాయపడ్డ యంగ్ హీరో, మహిళ మృతి