అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై యువకథానాయకుడు సుధాకర్ కారు అదుపుతప్పింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన సుధాకర్ ప్రస్తుతం నువ్వు తోపురా అనే సినిమాలో నటిస్తున్నారు. 

సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్నారు. అయితే శనివారం తెల్లవారు జామున సుధాకర్‌ కారు మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై అదుపు తప్పింది. 

మెక్కలకు నీరుపెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే దుర్మరణం చెందింది. అయితే కారులో ఉన్న నటుడు సుధాకర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.