పీలేరు: చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని పింఛా నదికి అవతలివైపున ఉన్న సీతారామయ్య కుటుంబాన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శుక్రవారం నాడు సాయంత్రం బయటకు తీసుకొచ్చారు.

నివర్ తుఫాన్ కారణంగా పింఛా నదికి భారీగా వరద నీరు వచ్చింది.దీంతో గురువారం నాడు రాత్రి పింఛా నదికి వచ్చిన వరద కారణంగా ఒడ్డునే  సీతారామయ్య కుటుంబం నిర్మించుకొన్న గుడిసె కొట్టుకుపోయింది.

గురువారం నాడు రాత్రి నుండి సహాయక చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుండి సహాయక చర్యలను కొనసాగించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

also read:చిత్తూరులో వరదలో చిక్కుకొన్న కుటుంబం: రెస్క్యూ చర్యలు చేపట్టిన అధికారులు

సుమారు 20 గంటలపాటు కష్టపడి  ఆరుగురిని బయటకు తీసుకువచ్చారు. ఏడాదిలోపున ఉన్న చిన్నారిని కుర్చీపై కూర్చొని బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. ఇవాళ ఉదయం నుండి నిరంతరాయంగా శ్రమించడం ద్వారా ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. 

మధ్యాహ్నం పూట తాడు సహాయంతో ఆరుగురికి భోజనం అందించారు. భోజనం తిన్న కొద్దిసేపటి తర్వాత రెస్క్యూటీమ్ వరద నుండి వారిని రక్షించారు.