పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో  ఆకులోల్లపల్లికి చెందిన సీతారామయ్య కుటుంబాన్ని రక్షించేందుకు  ఇవతలికి తీసుకొచ్చేందుకు రాత్రి నుండి ఆరుగురిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

నివర్ తుపాన్ కారణంగా పీలేరు నియోజకవర్గంలోని పింఛ నదికి భారీగా వరద పోటెత్తింది. వరద పోటెత్తడంతో  నదికి పక్కనే నిర్మించుకొన్న గుడిసె కొట్టుకుపోయింది.  దీంతో రాత్రి నుండి  ఆరుగురిని నదికి ఇవతలి వైపునకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

వరద పోటెత్తడంతో వారిని రక్షించే ప్రయత్నాలు సాధ్యం కావడం లేదు. దీంతో జేసీబీ సహాయంతో సీతారామయ్య కుటుంబానికి మధ్యాహ్నం  ఆహారాన్ని అందించారు.

ఈ నదికి వరద తగ్గిన తర్వాత  రెస్క్యూ చేస్తామని  స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఇలానే ఉంటే ఎలా వారిని రక్షించాలనే విషయమై కూడ అధికారులు యోచిస్తున్నారు.సంఘటన స్థలంలోనే ఎస్పీ సెంథిల్ కుమార్ రెస్క్యూ ఆపరేషన్స్ ను కొనసాగిస్తున్నారు. సీతారామయ్య కుటుంబంలో ఆరుగురు ఉన్నారు.

ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉండడంతో వారందరిని సురక్షితంగా నదిని దాటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు,.