సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్ హత్యకేసులో ట్విస్ట్: అస్థికల్లో కత్తెర లభ్యం

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో హత్యకు గురైన కౌన్సిలర్ సురేష్ హత్యకేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఆయన అస్థికల్లో కత్తెర లభ్యమైంది. ఈ కత్తెర సహాయంతోనే  సురేష్ ను  హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసే సమయంలో కూడ వైద్యులు కత్తెరను గుర్తించలేదా అనే విషయమై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు ఈ కేసులో బాలు అనే అనుమానితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

scissor found killed sullurupeta councillor suresh dead body

నెల్లూరు: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట  కౌన్సిలర్ సురేష్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకొంది. సురేష్ అస్థికల్లో టైలరింగ్ కత్తెర లభ్యమైంది. పోస్టుమార్టం చేసే సమయంలో ఈ కత్తెరను వైద్యులు గుర్తించలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

also read:సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్ హత్య: నిందితుడు బాలు లొంగుబాటు

రెండు రోజుల క్రితం సరష్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు గురైన సురేష్ మృతదేహన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్థానికంగా ఉన్న స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియ తర్వాత అస్థికలను  పవిత్ర నదిలో కలిపేందుకు సేకరిస్తున్న సమయంలో  కత్తెర లభ్యమైంది.

సురేష్ ను ఈ కత్తెర సహాయంతోనే నిందితుడు హత్య చేశాడా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. సురేష్ ను హత్య చేశానని బాలు అనే వ్యక్తి బుధవారం నాడు పోలీసులకు లొంగిపోయాడు. సురేష్  ఆర్ధిక లావాదేవీల్లో బాలు బినామీగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 9వ తేదీన సూళ్లూరుపేట రైల్వేగేటు వద్ద సురేష్  దారుణంగా హత్యకు గురయ్యాడు. పుట్టినరోజునే ఆయన హత్యకు గురికావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.సురేష్ ను హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులపై బాలును పోలీసులు విచారిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios