15 వేల టీచర్ పోస్టుల భర్తీ ?

15 వేల టీచర్ పోస్టుల భర్తీ ?

నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో రాష్ట్రప్రభుత్వం సుమారు 15 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయటానికి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటి వరకూ జరిపిన పరిశీలన ప్రకారం 14,494 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. వీటన్నింటినీ డీఎస్సీ-2018 నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అంటే 2018, అక్టోబర్ 31 నాటికి ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి నివేదికను సిద్దం చేసారు. వీటిల్లో ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేఫన్ విడుదల చేస్తారు. 

ఇందులో ఎస్జీటీ, ఎస్ఏ, ఎల్పీ, పీఈటీ, మ్యూజిక్, కంప్యూటర లిటరసీ పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే, మోడల్ స్కూల్, ఐఈడీఎస్ఎస్, మున్సిపల్ స్కూళ్ళలో టీచర్ పోస్టులను కూడా కలిపారు. ఎస్జీటీ పోస్టుల్లో 58 కన్నడ పోస్టులు కూడా ఉన్నాయి. మొదటిసారి ఫిజికల్ లిటరసీ, కంప్యూటర్ లిటరసీ పోస్టులను సృష్టించి మరీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే విద్యాశాఖ ప్రతిపాదించిన పోస్టులన్నింటీనీ భర్తీ చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నదే ప్రశ్న.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos