గుంటూరు జిల్లాలో స్కూలు పిల్లలతో వెళ్తున్న బస్సు కల్వర్టు నుంచి బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే... వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద 60 మంది పిల్లలతో వెళ్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూలుకు చెందిన బస్సు కల్వర్టుపై నుంచి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన చిన్నారులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్కూలు బస్సు ప్రమాదంపై విద్యార్థుల తల్లీదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు.