కర్నూల్: ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండలేననే కారణంతో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.

కర్నూల్ జిల్లాలోని  హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామానికి చెందిన సతీష్ కు కర్ణాటకలోని సండూరుకు చెందిన సవితతో వివాహమైంంది.

సతీష్, సవిత దంపతులకు ఇద్దరు పిల్లలు.  పెద్ద కొడుకు నిశ్చల్ వయస్సు 9 ఏళ్లు. చిన్న కొడుకు వెంకటసాయి  వయస్సు ఆరేళ్లు.

also read:గుంటూరులో ప్రేమ పేరుతో వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న విద్యార్ధిని

సతీష్ ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.  గ్రామంలోనే కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఉమ్మడి కుటుంబంలో ఇష్టం సవితకు ఇష్టం లేదు. వేరు కాపురం పెట్టాలని భర్తతో పలుమార్లు సవిత గొడవ పెట్టుకొంది.  ఉమ్మడి కుటుంబంతోనే ఉండాలని సతీష్ భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. వేరు కాపురం కోసం సవిత భర్తపై ఒత్తిడి పెట్టింది. ఈ ఒత్తిడికి ఆయన తలొగ్గలేదు.

వేరు కాపురానికి భర్త ఒప్పుకోవడం లేదని ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆ తర్వాత ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. 

తొలుత విద్యుత్ షాక్ తో వీరంతా మరణించారని భావించారు. కానీ ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు  సవిత ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొందని తేల్చారు.