గుంటూరు:  జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. ప్రేమ పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్ధిని ఓ యువకుడు వేధించాడు.ఈ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకొంది. 

గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడులో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఆత్మహత్య చేసుకొనే ముందు ఆ విద్యార్ధిని సెల్ఫీ వీడియోలో ఈ వేధింపుల అంశాన్ని ప్రస్తావించింది.

వరప్రసాద్ అనే యువకుడు  తనను వేధించాడని ఆ బాలిక సెల్ఫీ వీడియోలో  పేర్కొంది. వరప్రసాద్  పై చర్యలు తీసుకోవాలని  బాధితురాలు ఆ వీడియోలో కోరింది.ఈ వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఆమె తెలిపింది. తనను వేధించిన వరప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. 

బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆలస్యంగా గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక చనిపోయింది. 

ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని  ఆమె పోలీసులను ఆదేశించారు.