కాకినాడ జిల్లాలో విషాదం: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ సూసైడ్


కాకినాడ జిల్లా సర్పవరంలో ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడు. గురువారం నాడు రాత్రి తన సర్వీస్ రివాల్వర్ తో గోపాలకృష్ణ సూసైడ్ చేసుకొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Sarpavaram SI Gopala Krishna Commits Suicide In Kakinada District

సర్పవరం: Kakinada జిల్లా Sarpavaram ఎస్ఐ గోపాలకృష్ణ శుక్రవారం నాడు తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ Gopala Krishna ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవాళ కోనసీమలో  సీఎం పర్యటన ఉంది. ఈ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన విధుల్లో పాల్గొని గురువారం నాడు రాత్రి ఇంటికి వచ్చాడు. గురువారం నాడు రాత్రి తన ఇంట్లోనే  గోపాలకృష్ణ suicideకు పాల్పడ్డాడు. 

also read:యాదగిరిగుట్టలో విషాదం... లీవ్ ఇవ్వడంలేదని బస్సుకింద పడి ఆర్టిసి డ్రైవర్ ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలతో గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడా, ఇతర  కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన చదువుకు సరిపడు ఉద్యోగం రాలేదని కూడా తరచూ భార్య పావనితో చెప్పేవాడని తెలిసింది.ఇదే కారణంతో గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడా లేక ఇతరత్రా కారణాలా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఎస్ఐ ఉద్యోగానికి తాను సరిపోనని కూడా తరచూ మనో వేదనకు గురయ్యేవాడని తన బ్యాచ్ మేట్స్ తో కూడా చెప్పేవాడని పోలీసులుు చెప్పేవారు. పోలీస్ శాఖ నుండి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా  ఉన్నతాధికారులు చెప్పారు.

కడపలో ఏఆర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న చంద్రరావు 2021 డిసెంబర్ 30న ఆత్మహత్య చేసుకొన్నాడు.. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు  చెందిన చంద్రరావు కడపలో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సమస్యలతోనే చంద్రరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అనంతపురం జిల్లా కదిరి తాలూకా నల్లసింగయ్యగారి పల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991లో ఎస్సైగా పోలీస్ శాఖ లో చేరారు. ప్రస్తుతం సైబర్ ల్యాబ్  ఎస్సైగా పని చేస్తున్నారు. కర్నూలు అశోక్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. కాగా, 2001లో కర్నూలు రైల్వే ఎస్ఐ గా పనిచేసేటప్పుడు ఈయనపై రెండు కేసులు నమోదయ్యాయి. 

ఈ కేసులపై కోర్టులో విచారణ సాగుతుండడంతో పదోన్నతి ఆగిపోయింది. మరోవైపు రాఘవరెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రేమ పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నాడు. అప్పటి నుంచి కుమారులతో పాటు భార్యతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు రాఘవరెడ్డి దూరంగా ఉంటున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన 2021 డిసెంబర్ 6న  పురుగుల మందు తాగారు.

ఆ బాధ తట్టుకోలేక ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ లో కిందికి దిగి పక్కనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. వాచ్ మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ పార్థసారధి రెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఇలియాజ్ భాషా తదితరులు రాఘవరెడ్డి ఇంటికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాఘవరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మహిళా ఎస్ఐ భవాని  2021 ఆగష్టు 30న ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీసు అధికారుల హాస్టల్ లో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. 

  కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, నాగేశ్వరమ్మ దంపతులకు కుమార్తె భవానీ, కుమారుడు శివశంకర్‌ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి శ్రీనివాసరావు అనారోగ్యంతో ఇప్పటికే మృతి చెందారు. తల్లి నాగేశ్వరమ్మ పిల్లలిద్దరినీ కూలి పనులు చేసుకుంటూ చదివించింది. భవాని డిగ్రీ పూర్తయ్యాక స్వశక్తితో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించింది. 2018 బ్యాచ్‌కి చెందిన భవాని ఎస్‌ఐగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌లో చేరారు. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.

 సింహాచలం వెళ్లి స్వామిని దర్శించుకుని విధుల్లో చేరతానని తన తోటి సిబ్బందితో చెప్పింది. పోలీసు అధికారుల హాస్టల్‌ ఉన్న భవాని ఆదివారం ఉదయం ఎంతకీ గది నుంచి బయటకు రాలేదు. ఎన్నిసార్లు తలుపుకొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరిచిన సిబ్బందికి ఫ్యానుకు ఉరేసుకొని ఉన్న భవానిని గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌, వన్‌టౌన్‌ సీఐ మురళీ, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు తెరిపించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios