Asianet News TeluguAsianet News Telugu

నా నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర వద్దు: పోలీసులను కోరిన వైసీపీ ఎమ్మెల్యే

సంతనూతలపాడు (santhanuthalapadu mla) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే సుధాకర్ బాబు (sudhakar babu) తన నియోజకవర్గం పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని జిల్లా ఎస్పీని కోరారు.

santhanuthalapadu ycp mla sudhakar babu wants amaravati farmers padayatra should be stopped in his constituency
Author
Santhanuthalapadu, First Published Nov 7, 2021, 6:33 PM IST | Last Updated Nov 7, 2021, 6:37 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని (amaravathi) ఏకైక రాజధానిగా వుంచాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ‘‘ న్యాయస్థానం టు దేవస్థానం’’ (nyayasthanam to devasthanam) మహా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంతనూతలపాడు (santhanuthalapadu mla) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే సుధాకర్ బాబు (sudhakar babu) తన నియోజకవర్గం పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని జిల్లా ఎస్పీని కోరారు.

స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పాదయాత్రను కొనసాగించేట్టయితే, పాదయాత్ర మార్గాన్ని మార్చాలని సుధాకర్ బాబు సూచించారు. పోలీసు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీని ఒంగోలులో కలిసిన ఆయన ఈ మేరకు వివరించారు. మరోవైపు అమరావతి రైతుల మహా పాదయాత్ర నేటికి ఏడవ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. రైతులు మధ్యాహ్నం వంకాయలపాడులో భోజనం చేశారు. ఈ రాత్రికి ఇంకొల్లులో బసచేస్తారు. 

ALso Read:వైసీపీ కార్యకర్తలకు రెడ్ కార్పెట్ .. రైతుల పాదయాత్రకేమో అడ్డమా: పోలీసులపై లోకేశ్ మండిపాటు

కాగా.. మహాపాదయాత్ర (amaravati farmers padayatra)కు సోమవారం సెలవు ప్రకటించారు . కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు సెలవు ప్రకటించాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఇక, అమరాతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు. శనివారం ఈ పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఇంకొల్లుక మహాపాదయాత్ర చేరుకోనుంది. 

సోమవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో.. మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిథిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనాలు మద్దతు తెలుపుతున్నారని నిర్వాహకులు వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజీపీ, సీపీఐ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమరావతి ప్రాంత రైతులు కోరుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios