Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ కార్యకర్తలకు రెడ్ కార్పెట్ .. రైతుల పాదయాత్రకేమో అడ్డమా: పోలీసులపై లోకేశ్ మండిపాటు

వైసీపీ (ysrp) ప్రభుత్వంపై టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. రాజధాని కోసం మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అడ్డు చెప్పడాన్ని ఆయన విమర్శించారు.

tdp leader nara lokesh angry on police over stopping amaravati padayatra
Author
Amaravati, First Published Nov 7, 2021, 2:33 PM IST

వైసీపీ (ysrp) ప్రభుత్వంపై టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. రాజధాని కోసం మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అడ్డు చెప్పడాన్ని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు రచ్చ చేసేందుకు అడ్డురాని నిబంధనలు కేవలం అమరావతి రైతుల పాదయాత్రకే అడ్డొచ్చాయా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. కరోనా నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డంకిగా మారాయా? అని ఆయన మండిపడ్డారు.

నడిరోడ్డుపై అధికార పార్టీ నేతలు రచ్చ చేస్తున్నప్పుడు పోలీసులు (ap police) ఎందుకు అడ్డుకోవట్లేదని ఆయన నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు నోటీసులివ్వడమే పోలీసుల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణచేసేందుకు కుట్రలు పన్నుతున్నారని లోకేశ్ విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదని... యాత్రను అడ్డుకోవాలని చూస్తే, మరింత ఉద్ధృతం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ALso Read:అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు మహాపాదయాత్ర (amaravati farmers padayatra)కు సోమవారం సెలవు ప్రకటించారు. కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రకు సెలవు ప్రకటించాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఇక, అమరాతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు. శనివారం ఈ పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఇంకొల్లుక మహాపాదయాత్ర చేరుకోనుంది. 

సోమవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో.. మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిథిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనాలు మద్దతు తెలుపుతున్నారని నిర్వాహకులు వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజీపీ, సీపీఐ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమరావతి ప్రాంత రైతులు కోరుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios