Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు.. భారీగా తరలివచ్చిన జనం.. చంద్రగిరిలో ముగ్గురికి గాయాలు..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరందుకున్నాయి. పలు గ్రామాలల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. యువత ఉత్సహంగా జల్లికట్టు పోటీల్లో పాల్గొంటారు. 

Sankranti 2023 Jallikattu Competitions in full swing in tirupati district
Author
First Published Jan 14, 2023, 1:26 PM IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరందుకున్నాయి. పలు గ్రామాలల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. యువత ఉత్సహంగా జల్లికట్టు పోటీల్లో పాల్గొంటారు.  పశువుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు ఈ జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా జల్లికట్టు పోటీలు  జరుగుతున్నయి. అయితే అక్కడ జరుగుతున్న పోటీల్లో ముగ్గురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే.. జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు మాత్రం ఇవ్వేమి పట్టించుకోకుండా పోటీలను నిర్వహిస్తున్నారు. 

సంక్రాంతి పర్వదినం సందర్భంగా జల్లికట్టు సహా ఎటువంటి క్రీడలకు అనుమతి లేదని పోలీసుల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహించే జల్లికట్టుపై పూర్తిగా నిషేధం ఉందని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ స్పష్టం చేశారు. డబ్బుల కోసం జల్లికట్టు, పేకాట, గుండాట వంటివి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇక, జల్లికట్టు అనే పేరు చెప్పగానే అందరికి ముందుగా తమిళనాడు గుర్తుకు వస్తుంది. అయితే తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు తరహాలో పశువుల పండుగ జరుగుతుంది. తమిళనాడులో కనుమ రోజు జల్లికట్టు జరుకుంటే.. ఇక్కడ మాత్రం సంక్రాంతి ముందే నుంచే ప్రారంభం అవుతుంది. అయితే తాము నిర్వహించేది జల్లికట్టు కాదని పశువుల పండగ  స్థానికులు చెబుతారు. చాలా ఏళ్ల నుంచి తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios