ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ చీప్ గా  ఉన్న సునీల్ కుమార్ ను ప్రభుత్వం  ఇవాళ బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో  రిపోర్టు  చేయాలని  ఆదేశించింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను సోమవారం నాడు బదిలీ చేసింది ప్రభుత్వం. సునీల్ కుమార్ స్థానంలో ఎన్. సంజయ్ ను నియమించింది జగన్ సర్కార్. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ శాఖ డీజీగా సంజయ్ కొనసాగుతున్నారు. సీఐడీ డీజీగా ఇవాళ బదిలీ చేసింది. ఫైర్ సర్వీసెస్ ను కూడా అదనంగా సంజయ్ కి కేటాయించింది. 1996 ఐపీఎస్ బ్యాచ్ కి అధికారి సంజయ్. ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఆకస్మాత్తుగా బదిలీ చేయడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.