ఎన్నికల అధికారి వాణీమోహన్‌ను సస్పెండ్ చేయడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గబ్బర్ సింగ్ అనుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. ఉద్యోగులను సరెండర్ చేస్తే మళ్లీ వేరే వారిని పంపుతామన్నారు.

అహంకారం ఎక్కువై నియంతలా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు సజ్జల. నిమ్మగడ్డకు ఎవరో బాగా గాలి కొట్టడంతో సూపర్‌మ్యాన్‌లా ఫీలవుతున్నారని ధ్వజమెత్తారు.

Also Read:మరో అధికారిపై వేటేసిన నిమ్మగడ్డ: ఎన్నికల సంఘం సెక్రటరీగా వాణీ మోహన్‌ తొలగింపు

కరోనా సమయంలో తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని విజ్ఞప్తి చేస్తే.. వాళ్లకి వార్నింగ్ ఇచ్చేందుకే ఈ చర్యలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్లడం ఖాయమన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాలుగైదు నెలల్లో విశాఖకు వెళ్లే అవకాశం వుందని సజ్జల స్పష్టం చేశారు. నెల అటో, ఇటో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్లడం మాత్రం ఖాయమన్నారు. కోర్టులను కన్వీన్స్ చేస్తామనే నమ్మకం వుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.