స్పష్టమైన ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్.. ఆర్థిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు: సజ్జల

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు అరెస్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. 

sajjala ramakrishna reddy Comments on Chandrababu naidu Arrest ksm

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు అరెస్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. స్పష్టమైన ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని తెలిపారు. ఆర్థిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు విషయం చెప్పకుండా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు, నోటీసులు ఇవ్వలేదని టీడీపీ ఆరోపణలు చేస్తుందని అన్నారు. అన్నీ తెలిసే చంద్రబాబు రెండు, మూడు రోజుల నుంచి అరెస్ట్ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు దబాయించి చేసిన తప్పుల నుంచి బయటపడాలనుకుంటే కుదరదని అన్నారు. 

సీఐడీ ఎఫ్‌ఐఆర్‌కు ముందే జీఎస్టీ నిఘాలో ఈ స్కామ్ బయటకు వచ్చిందని చెప్పారు. 2017-18‌లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం చంద్రబాబు  హయంలో రిలీజ్ చేసిన రూ. 370 కోట్లలో రూ. 240 కోట్లు దారిమళ్లాయని గుర్తించిందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండేళ్ల కిందటే సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదైందని అన్నారు. తేదీలేని ఎంవోయూ కుదుర్చుకున్నారని అన్నారు. జీవో ప్రకారం ఏమీ జగరలేదని.. దాని పక్కకు పెట్టేశారని ఆరోపించారు. అది వంద శాతం ప్రభుత్వ ఎయిడెడ్ స్కీమ్‌ అయిపోయిందని అన్నారు. డిజైన్‌టెక్ ద్వారా హవాలా జరిగి టీడీపీ వాళ్లకు డబ్బులు వచ్చినట్లు తేలిందని చెప్పారు. ఎంవోయూ అయ్యాక ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలు చెప్పారని తెలిపారు. నోట్ ఫైల్స్‌లో కూడా ఉన్నతాధికారులు ప్రస్తావించారని చెప్పారు. 

ఈ స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ఉందని అందరికి తెలిసిందేనని అన్నారు. దర్యాప్తులో ఆధారాలు దొరికేవరకు ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చకపోవడమే సీఎం జగన్ నిజాయితీ, నిష్పాక్షిక వైఖరికి నిదర్శనం అని చెప్పారు. వైఎస్ జగన్‌కు కక్ష సాధింపు ఉంటే.. పరిస్థితి మరొలా ఉండేదని  అన్నారు. 

ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదని అన్నారు. ఈ స్కామ్‌లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాత్ర ఉందనే దానికి బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. 2018లోనే విజిల్ బ్లోయర్ ద్వారా ఈ స్కామ్ బయటపడిందని అన్నారు. చంద్రబాబు ఆయన హయాంలోనే నిష్పక్షపాత దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. సీమెన్స్ పేరు వాడుకుని సుమన్ బోస్, సుబ్బారావు కలిసి చంద్రబాబు నేతృత్వంలో స్కామ్‌ జరిగిందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఈ స్కామ్‌పై దర్యాప్తు  జరుగుతుందని తెలిపారు. 

చంద్రబాబును కరుణానిధిని అరెస్ట్ చేసినట్టుగా అర్దరాత్రి అరెస్ట్ చేయలేదని అన్నారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోని ప్రశ్నించడం సాధారణ విషయం అని  చెప్పారు. చంద్రబాబు ఉరి తీయాలని మాట్లాడుతున్నాడని.. అయితే ఎందుకు ఉరి తీస్తారని ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం లేదని తేలితే ఆయన బయటకు వస్తారని అన్నారు. సీఐడీ స్వతంత్రగా వ్యవహరిస్తుందని.. వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలు ప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకురావడానికి వెళ్తే.. టీడీపీ శ్రేణులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌తో తమకు వచ్చే లాభమేమి లేదని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios