Asianet News TeluguAsianet News Telugu

ఆ ముగ్గురికే మళ్లీ టికెట్లు ఖాయం... వైసిపి అభ్యర్థులను ప్రకటించిన సజ్జల (వీడియో)

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార వైసిపి స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాయకులందరూ ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందిస్తున్న వైసిపి తాజాగా అభ్యర్థుల ప్రకటనను కూడా ప్రారంభించింది.  

Sajjala Ramakrishna Reddy announced Vijayawada YCP Candidates AKP VJA
Author
First Published Aug 16, 2023, 9:54 AM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీ లన్నీ ఇప్పటికే ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. అధికార వైసిపితో పాటు ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. అధికార పార్టీ మరో అడుగు ముందుకేసీ అభ్యర్ధుల ప్రకటననను కూడా ప్రారంభించింది. వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలోని మూడు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించారు. 

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు. దీంతో విజయవాడలో జరిగిన వెల్లంపల్లి పుట్టినరోజు వేడుకలకు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ తిరిగి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీచేస్తారంటూ అదిరిపోయే భర్త్ డే గిప్ట్ ఇచ్చారు సజ్జల.ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

కేవలం విజయవాడ పశ్చిమ నియోజకర్గం మాత్రమే కాదు మిగతా రెండు నియోజకవర్గాల అభ్యర్ధులను సైతం సజ్జల ప్రకటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మల్లాది విష్ణు పోటీచేస్తారని ప్రకటించారు. విజయవాడలోని మూడుకు మూడు నియోజవర్గాల్లో వైసిపి జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ ముగ్గురిని బంపర్ మెజారిటీలో గెలిపించుకోవాలన విజయవాడ ప్రజలను సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.  

వీడియో

ఇదిలావుంటే టిడిపి, జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై సజ్జల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి చంద్రబాబు ఆండ్ ఆర్కెస్ట్రా టీమ్ జనంలోకి వస్తోందంటూ సెటైర్లు వేసారు. గత ఐదేళ్లలో ప్రజలకోసం ఏం చేశారో చెప్పడానికి చంద్రబాబు,లోకేష్ వద్ద సమాధానం లేదన్నారు. చంద్రబాబు తనను తాను అద్దంలో చూసుకుని తిట్టుకోవాలని సజ్జల అన్నారు. 

నిన్నమొన్నటి వరకూ ఏపీని ఆర్థిక  సంక్షోభంలో  కూరుకుపోయిందని... మరో శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు విమర్శించాడని సజ్జల గుర్తుచేసారు. కానీ ఇప్పుడు ఓట్లకోసం తాము అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామంటున్నాడని అన్నారు. గత ఐదేళ్లలో చెప్పిన అబద్ధాలే మళ్లీ చెబుతున్నాడు... ప్రజలు నమ్మరని తెలిసినా ఏ ధైర్యంతో  ముందుకు వస్తున్నాడో అర్థంకావడం లేదన్నారు. ప్రజలను మళ్లీ భ్రమలో పెట్టి కొడుకును అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు... కానీ ముందు విశ్వసనీయత, చిత్తశుద్దితో ఎలా ఉండాలో లోకేష్ నేర్పిస్తే బాగుంటుందన్నారు. కానీ తనలాగే కొడుక్కి కూడా దొంగపనులే నేర్పిస్తున్నాడని... అడ్డదారులు తెలిసిన చంద్రబాబుకి అంతకంటే మంచి ఆలోచన ఎలా వస్తుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios