విశాఖపట్టణం: విశాఖ జిల్లా అనకాపల్లిలో డిగ్రీ విద్యార్ధినియశోదాభార్గవిపై దాడికి పాల్పడిన నిందితుడు మరో హత్యకు కూడ కుట్ర చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ విషయాన్ని  వెల్లడించాడు.

విశాఖ పట్టణం జిల్లా అనకాపల్లిలో  బుధవారం నాడు సాయంత్రం సాయి అనే యువకుడు భార్గవిపై దాడికి పాల్పడ్డాడు.భార్గవి స్నేహితుడు మక్సూద్‌ను హత్య చేసేందుకు సాయి ప్లాన్ చేశాడు. 

బుధవారం నాడు మక్సూద్‌ను చంపేందుకు ప్లాన్ చేశాడు. కానీ,  ఆ సమయంలో మక్సూద్ తప్పించుకోవడంతో భార్గవిపై సాయి దాడికి పాల్పడ్డాడు. భార్గవి గొంతులో పదునైన ఆయుధంతో దాడికి దిగాడు. ఈ దాడిలో భార్గవికి గొంతు, భుజం, పక్కటెముకల్లో తీవ్రమైన గాయాలయ్యాయి.

ఈ గాయాల కారణంగా  ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితుడు సాయిని స్థానికులు చితకబాదారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు.
 

సంబంధిత వార్తలు

దారుణం: డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడి, పరిస్థితి విషమం