అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లొలో  డిగ్రీ విద్యార్ధిని యశోద భార్గవిపై సాయి అనే యువకుడు గొంతులో స్కూడ్రైవర్ తో దాడికి దిగాడు. విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉంది. నడిరోడ్డుపై విద్యార్ధినిపై దాడికి దిగాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అనకాపల్లిలో డీవీఎన్ కాలేజీలో యశోద భార్గవి డిగ్రీ ఫస్టియర్ చదువుతుంది. కొంతకాలంగా సాయి అనే యువకుడు భార్గవిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బుధవారం నాడు కాలేజీ నుండి ఇంటికివెళ్లున్న భార్గవిని సాయి బుధవారం నాడు స్కూడ్రైవర్ తో దాడి చేశాడు. ఈ ఘటన రామచంద్ర థఇయేటర్ వద్ద చోటు చేసుకొంది.

నిందితుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ప్రేమ తిరస్కరించడంతో సాయి ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. భార్గవి ముఖం,భుజం, పక్కటెముకల్లో తీవ్ర గాయాలయ్యాయి.