Garikapati Narasimha Rao: గరికపాటి నరసింహారావు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. దీంతో గరికపాటి సారీ చెప్పాల్సి వచ్చింది.   

Garikapati Narasimha Rao: గరికపాటి నరసింహారావు.. తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.. ఆయ‌న గురించి తెలియని వారుండ‌రు. నిత్యం యూట్యూబుల్లోనే లేదా వాట్సాప్ స్టేటస్ ల్లోనూ తారస పడుతుంటారు. ఆయ‌న ప్ర‌వచనాల ఏదోక ర‌కంగా.. మ‌న చెవిన ప‌డుతుంటాయి. అందరికీ ఏదోబోధ చేస్తూ కనిపిస్తూనే ఉండారు. గరికపాటి ఉపన్యాసాలు వినడానికి అనేక మంది తహతహలాడుతుంటారు. అందులో యువ‌త కూడా ఉండ‌టం విశేషం. అయితే... గ‌తంతో చేసిన ఆయ‌న చేసిన ఓ ప్ర‌వ‌చ‌నంలోని వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దంగా మారాయి. త‌మ మ‌నోభావాల‌ను కించప‌రిచారని, పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావ‌డంతో గరికపాటి సారీ చెప్పాల్సి వచ్చింది. ఇంత‌కీ ఆయ‌న సారీ చెప్పాడానికి అస‌లు కార‌ణ‌మేంటీ? 

 వివరాల్లోకెళ్తే.. గరికపాటి నరసింహారావు 2006 సంవత్సరంలో ఓ ప్ర‌ముఖ‌ చానల్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్వర్ణకార వృత్తి చేసే విశ్వ బ్రాహ్మణులు కించపరిచే విధంగా మాట్లాడారని కొంత కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వర్ణకారులు. ఈ వ్యాఖ్య‌ల‌ను వెన‌కు తీసుకుని.. గరికపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు స్వర్ణకారులు. వెంటనే తమకి క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వర్ణకారులు రోడ్డుపై భైఠాయించి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గరికపాటి సారీ చెప్పకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పోలీసులు అక్కడకి చేరుకుని వారితో చర్చలు జరిపారు. అనంతరం గరికపాటి.. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో చర్చించారు. తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు గరికపాటి నరసింహారావు. గతంలోనూ గరికపాటి వ్యాఖ్య‌లు పలుమార్లు వివాదాలకు దారితీశాయి. ఇటీవల కూడా పుష్ప సినిమాపై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు గరికపాటి. ఒక స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ఏమింట‌నీ ప్రశ్నించారు.