అమరావతి: మే 23న విడుదల కాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె గురువారం జరిగే ఎన్నిక ల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను నమ్మి సంబరం చేసుకుటుందని అవి కలలుగానే మిగిలిపోతాయని హెచ్చరించారు.

 వైఎస్ జగన్ సీఎం అనేది ఎప్పటికి నెరవేరదన్నారు. మరోవైపు హింసను ప్రేరేపించి టీడీపీపై నెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకపోతే ఎన్డీయేకు 200 స్థానాలు కూడా రావని చెప్పారు. 

చంద్రబాబు నాయకత్వంలోని యూపీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 23 ఫలితాల తర్వాత మోదీ శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తారని సాదినేని యామిని ఎద్దేవా చేశారు.