అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును పొగిడిన అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ లు పార్టీ వీడిన తర్వాత చంద్రబాబు నాయుడును విమర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ లు పార్టీ వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పార్టీ వీడిన వలస నేతలకు ప్రజాదరణ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే భయంతోనే ఇద్దరు నేతలు పార్టీ వీడారని సాధినేని యామిని విమర్శించారు. గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుని ఆ తర్వాత పార్టీ మారుతున్నారని దీన్ని ప్రజలు అంగీకరించరన్నారు.