శాప్ బోర్డు మీటింగ్‌లో రసాభాస.. ఎండీ ప్రభాకర్ రెడ్డిపై చైర్మన్ సిదార్థరెడ్డి ఆగ్రహం..!
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) బోర్డు మీటింగ్‌లో రసాభాస చోటుచేసుకుంది. శాప్‌లోని బోర్డు డైరెక్టర్లు, ఎండీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) బోర్డు మీటింగ్‌లో రసాభాస చోటుచేసుకుంది. శాప్‌లోని బోర్డు డైరెక్టర్లు, ఎండీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎండీ ప్రభాకర్ రెడ్డి తీరుపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిదార్థరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఈరోజు శాప్ బోర్డు మీటింగ్ జరగగా ఎండీ ప్రభాకర్ రెడ్డి తీరుపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిదార్త్ రెడ్డితో సహా డైరెక్టర్లు అసంతృప్తి చేశారు. శాప్ డైరెక్టర్టు వివిధ సమస్యలను బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించారు. తాము ప్రస్తావించే చిన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆరోపించారు.
ఈ క్రమంలోనే స్పందించిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిదార్థరెడ్డి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఎండీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ప్రభాకర్ రెడ్డి నుంచి సరైనా సమాధానం రాకపోవడంతో సిదార్థరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ సిదార్థరెడ్డి, డైరెక్టర్లు బోర్డు మీటింగ్‌ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. ఇక, గతకొంతకాలంగా శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి వైఖరితో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.