రన్నింగ్ కారులో మంటలు చెలరేగిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా కారులో గ్యాస్ లీకయి మంటలు చెలరేగాయి.
విజయవాడ : రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్నకారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మంటలు ప్రారంభంకాగానే గుర్తించి కారులోని వారు వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుండి హైదరాబాద్ కు కొందరు కారులో బయలుదేరారు. జాతీయ రహదారిపై దూసుకుపోతుండగా కారులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీక్ కావడంతో కారు వెనకాల సిలిండర్ దగ్గర మెల్లగా మంటలు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం వద్ద కారును ఆపాడు. కారులోని వారు దిగి దూరంగా వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.
రోడ్డుపక్కన ఆపిన కొద్దిసేపటికే మంటలు కారంతా వ్యాపించాయి. చూస్తుండగానే కారు మొత్తం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఇలా రన్నింగ్ లో వుండగా మంటలు చెలరేగడంతో గ్యాస్ కార్లను ఉపయోగించేవారిని భయాందోళనకు గురవుతున్నారు.
Read More విజయవాడలో దారుణం... పడుకున్న భర్తపై సలసలకాగే వేడినీళ్లు పోసిన భార్య
ఇటీవల విశాఖపట్నంలో కూడా ఇలాగే ఓ కారు రన్నింగ్ లో వుండగానే మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై దూసుకెళుతున్న ఓ కారు వెంకోజిపాలెం మెడికవర్ హాస్పిటల్ సమీపంలో మంటల్లో చిక్కుకుంది. కారు ఇంజన్ నుండి పొగలు రావడంతో అందులోనివారు జాగ్రత్తపడ్డారు.వెంటనే కారును రోడ్డుపక్కకు తీసుకుని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.
కారు ఇంజన్ లో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి. దట్టమైన మంటలతో పాటు నల్లటి పొగలు అలుముకోవడంతో భయానక వాతావరణ నెలకొంది. మంటల్లో కారు పూర్తిగా దగ్దమయిపోయింది.
