నడుస్తూ ఉండగానే ఓ ఆర్టీసీ బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. అయితే బస్సు ఎక్కువ స్పీడ్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

పశ్చిమ గోదావరి జిల్లా : పశ్చిమగోదావరి జిల్లాలో నడుస్తూ నడుస్తూ ఉండగానే ఆర్టీసీ బస్సు చక్రాలు అకస్మాత్తుగా ఓడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద సోమవారం ఉదయం జరిగింది. అయితే, బస్సు మరీ ఎక్కువ స్పీడ్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు నిలిచిపోవడంతో దానిలో ఉన్న 40మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికుల కథనాల మేరకు… 

నరసాపురం డిపోకు చెందిన బస్సు జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళుతుండగా.. అజ్జమూరు వద్ద బస్సువెనుక భాగంలో ఓ వైపున రెండు చక్రాలు ఊడిపోయాయి. ఒకటి పూర్తిగా బయటకు వచ్చింది. దీన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేశాడు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు దొరికి పోవడంతో దానిలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. తర్వాత వారిని వేరే బస్సులలో గమ్యస్థానాలకు పంపించారు. గోతుల మయంగా ఉన్న రహదారుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నాకు ప్రాణ హాని ఉంది,గన్ మెన్లను మార్చారు: వైఎస్ హత్య కేసు నిందితుడు దస్తగిరి

అయితే, ఇలాంటి ఘటనలు ఇదేం మొదటిసారి కాదు.. నిరుడు జులైలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి-మోత్కూర్ ప్రధాన రహదారిపై సుమారు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఇలా ప్రమాదానికి గురైంది. బస్సు ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనే ఓ పక్కకు ఒరిగి పోయింది. ఈ ఊహించని ఘటనతో బస్సులోని ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొద్ది క్షణాలపాటు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండిపోయారు. కాసేపటి తర్వాత తేరుకుని... బస్సు దిగి చూడగా అంతా షాక్ అయ్యారు. 

బస్సు వెనుక చక్రాలు రన్నింగ్ లో ఉండగానే ఊడిపోవడంతో బస్సు కుదుపుకు గురైనట్లు తెలుసుకున్నారు. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూరుకు 40 మంది ప్రయాణికులతో వెడుతుంది. బస్సు రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై మోటకొండూరు మండలం కాటేపల్లి వద్దకు చేరుకోగానే బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. బస్సు నెమ్మదిగా ప్రయత్నిస్తుండటంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్యారేజీలో బస్సును సరిగా పరిశీలించాక పోవడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.