అమరావతి: గుంటూరు జిల్లాలో రెడ్ జోన్ లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐకి కరోనా సోకింది. ఆర్ఎస్ఐ కుటుంబాన్ని కూడ క్వారంటైన్ కి తరలించారు అధికారులు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోన 6వ బెటాలియన్ కు చెందిన ఆర్ఎస్ఐకి రెడ్ జోన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు కరోనా సోకింది. ఈ విషయం ఆదివారం నాడు తేలింది.

ఆర్ఎస్ఐకి కరోనా సోకిన విషయం తేలిన వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎస్ఐ కుటుంబసభ్యులను కూడ క్వారంటైన్ కి తరలించారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ఆదివారం నాటికి కరోనా కేసులు 1563కి చేరుకొన్నాయి.

also read:మద్యం ధరలను 25 శాతం పెంచే యోచనలో ఏపీ సర్కార్

ఏపీ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 411 కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు కరోనాపై సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.