మద్యం ధరలను 25 శాతం పెంచే యోచనలో ఏపీ సర్కార్
రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు.
అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం మద్యం దుకాణాలను మూసివేశారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మద్యం దుకాణాలు తెరవనున్నారు.
ఏపీ రాష్ట్రంలో మద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండేలా ధరలను విపరీతంగా పెంచనున్నారు. ఇప్పటికే ధరలను పెంచింది సర్కార్. మరో 25 శాతం ధరలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆదివారం నాడు కరోనా వైరస్ పై సమీక్ష సమయంలో ఈ మేరకు ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
also read:మే 17 వరకు భక్తులకు వెంకన్న దర్శనం నిలిపివేత:టీటీడీ
మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా ధరలను పెంచాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు కూడ ధరలు పెంచడం కూడ పనికొస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గించారు. మరో వైపు రానున్న రోజుల్లో మరిన్ని దుకాణాలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.