Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో ఏటీఎంల ట్యాంపరింగ్..రూ. 70 లక్షలు చోరీ, ఇద్దరు అరెస్ట్

ఏటీఎంలలో టాంపరింగ్ ద్వారా రూ. 70 లక్షలు కాజేసిన ఇద్దరు అంత ర్రాష్ట్ర నిందితులు పోలీసులకు చిక్కారు. పలు బ్యాంకులకు చెందిన 99 ఎటిఎం కార్డులు, రెండు సెల్ ఫోన్లు, రూ. 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింప జేశారు. 

Rs. 70 lakhs stolen with ATM Tampering, two arrested in tirupati
Author
Hyderabad, First Published Dec 10, 2021, 7:38 AM IST

తిరుపతి :  తిరుపతిలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 
ATMs Tampering చేసిందో ముఠా. ఈ నేరంలో రూ.70 లక్షలు చోరీ చేసింది. అచ్చు సినిమాటిక్ లెవల్ లో వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుల్ని ఎట్టకేలకూ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే... 

ఏటీఎంలలో టాంపరింగ్ ద్వారా రూ. 70 లక్షలు కాజేసిన ఇద్దరు అంత ర్రాష్ట్ర నిందితులు పోలీసులకు చిక్కారు. పలు బ్యాంకులకు చెందిన 99 ఎటిఎం కార్డులు, రెండు సెల్ ఫోన్లు, రూ. 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుల బ్యాంకు ఖాతాలను స్తంభింప జేశారు. 

డీపీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్ప నాయుడు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్ బిఐ ATMలోకి ఇద్దరు వచ్చి ట్యాంపరింగ్ చేసి నగదు కాజేసినట్లు Bank Manager రమేష్ కుమార్ ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు CCTV footage లు అందించారు.

తిరుపతి తూర్పు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోని ఎస్ బిఐ ఎటిఎం దగ్గరున్న నిందితుల్ని సిఐ శివప్రసాద్రెడ్డి, ఎస్సై  ప్రకాష్ కుమార్ అదుపులోకి తీసుకుని విచారించారు. హర్యానా రాష్ట్రం Nuh District పిప్రోలి గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్ (25), సలీం ఖాన్ (25) గా వారిని గుర్తించారు.

అక్టోబర్ నుంచి ఇప్పటివరకు తిరుపతిలోని తూర్పు, పడమర పీఎస్ లు, ఎస్వీ యూ, తిరుచానూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన  ఆరు కేసుల్లో వీరు నిందితులు. వీరికి సహకరించిన నకీబ్ హుస్సేన్, ఇలియాస్, హక్ముదీన్ పరారీలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, నవంబర్ 6న మంచిర్యాలలో ఏటీఎం మెషీన్‌లో నగదు దొంగిలించినందుకు గానూ  Haryanaకు చెందిన నలుగురు వ్యక్తులు అరెస్టైన విషయం తెలిసిందే. వీరంతా కూడా నుహ్ జిల్లాకు చెందినవారే. అరెస్టైన నిందితులకు అత్యాధునిక కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను రెండు రోజుల కస్టడీ విచారణలోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 

దొంగ ప్రేమలో పడ్డ బ్యాంక్ క్యాషియర్... ఇద్దరూ కలిసి ఏం చేశారంటే..

నిందితులు ఉపయోగించిన ఫోన్ల ధర కనీసం రూ.60,000 ఉంటుందని తెలిసి ముందుగా షాక్ అయ్యారు. అంతేకాదు  "ఈ నిందితుల ఫోన్‌లలో, వారు High-end cars, bikesలను ఉపయోగిస్తున్నట్లు మేం కనుగొన్నాం" అని మంచిర్యాల పోలీసు వర్గాలు  తెలిపాయి.వీరి నేరచరిత్రను తవ్విన పోలీసులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. నిందితులు రాబిన్ ఖాన్, సాహిబ్, హరీష్ లు నుహ్ జిల్లాకు చెందిన వారు కాగా, ఎజాజ్ అహ్మద్ ఖాన్ హర్యానాలోని పాల్వాల్ నివాసి. Accused గతంలో హైవేలపై పార్క్ చేసిన వాహనాల నుంచి టైర్లను దొంగిలించేవారు. తరువాత, వారి గ్రామస్థుల సహాయంతో, వారు ATM మెషీన్ల నుండి నగదును దొంగిలించే వివిధ పద్ధతులను నేర్చుకున్నారు. 

అలా ATM నగదు చెస్ట్‌ను గ్యాస్ కట్టర్‌తో కత్తిరించారు. “ఇప్పటి వరకు, మేం నిందితుల వద్ద నుండి 60 ATM కార్డులను స్వాధీనం చేసుకున్నాము.  తమ గ్రామంలో ఒక్కో కార్డుకు రూ.1000 కమీషన్‌తో చాలా మంది ఏటీఎం కార్డులు అద్దెకు ఇస్తున్నారని నిందితులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించినప్పుడు ఒక్కో ఖాతాలో లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిసింది' అని పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios