Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో 4 రుపాయలకే రాజన్న భోజనం, ఈ రోజే ప్రారంభం

" పేదవాడికి 4 రూపాయలకే రాజన్న భోజనం" పథకం ఈ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మంగళగిరిలో ప్రారంభమవుతూ ఉంది.వైసిసి ఎమ్మెల్లె ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన నిర్వాహకుడు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2004 మే 14 వ తేది ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన రోజుకు గుర్తుగా ఆయన ఈ పథకం ప్రారంభిస్తున్నారు.

Rs 4 Rajanna meals to begin this midday at mangalagiri

Rs 4 Rajanna meals to begin this midday at mangalagiri

 

" పేదవాడికి 4 రూపాయలకే రాజన్న భోజనం" పథకం ఈ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మంగళగిరిలో ప్రారంభమవుతూ ఉంది.

 

వైసిసి ఎమ్మెల్లె ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన నిర్వాహకుడు. 

 

గత ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2004 మే 14 వ తేది ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన రోజుకు గుర్తుగా ఆమన ఈ పథకం ప్రారంభిస్తున్నారు.

 

రాజశేఖర్ రెడ్డి పదవీ స్వీకారంలో ఆంధ్రలో సంక్షేమానికి సంబంధించి ఒక కొత్త యుగం  ప్రారంభమయింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన  రోజు ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసిన రోజు. అందుకే దీనికి గుర్తుగా  ఆ రోజునే పేదవాడి ఆకలి తీర్చాలని ఓ మంచి ఆశయంతో " రాజన్న క్యాంటీన్" ద్వార కేవలం 4 రూపాయలకే అందించాలని నిర్ణయించాను. ఇందులో కూర అన్నం, పెరుగు అన్నం, వారం లో 4 రోజులు ఒక కోడిగుడ్డు, మిగిలిన 3 రోజులు అరటి పండు, వడియాలు, వాటర్ ప్యాకెట్. ఇవి అన్ని అందజేస్తారు,’ అని ఆయన చెప్పారు.

 

 ఈ క్యాంటీన్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తారు.

 

రోజూ  3వందల నుండి 5 వందల మందికి ఈ భోజనం అందజేస్తారు.

 

ఈ పథకం  ప్రారంభానికి ముందు ఎమ్మెల్య ఆళ్ల హైదరాబాద్ లో  రు.5 భోజనం కూడా రుచి చూశారు.

 

 క్వాలిటీ భోజనం తాను అందించాలనుకున్నట్లు ఆయన ఆరోజే చెప్పారు. అది ఈ రోజు నిజం చేస్తున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios