తిరుపతి: తిరుమలలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  సమీప బంధువుల వస్తువులు చోరీకి గురయ్యాయి. బుధవారం తెల్లవారుజామున మణిమంజరి అతిథిగృహంలో ఈ చోరీకి గురైనట్టుగా బాధితులు తెలిపారు.

వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  బంధువులు మంగళవారం నాడు తిరుమలకు చేరుకొన్నారు.  అర్ధరాత్రి సుమారు  ఒంటి గంట వరకు వీరంతా కబుర్లు చెప్పుకొన్నారు. అయితే తెల్లవారుజామున ఐదు గంటలకు వారంతా నిద్రలేచారు. అయితే అప్పటికే చోరీ జరిగింది. సుమారు రూ. 2లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

మణి మంజరి అతిథి గృహం వెనుక భాగంలో లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు లభ్యమయ్యాయి. మణిమంజరి గెస్ట్ హౌజ్‌లో పనిచేసే సిబ్బందిపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై  పోలీసులు, విజిలెన్స్  అధికారులు విచారణ చేస్తున్నారు.