అతడి శరీరంపై సుమారు 10-12 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మృతుడు పవన్‌కుమార్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 

కడప నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. తిలక్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌ అనే రౌడీషీటర్‌కు ఇటీవల కాలంలో రాము అనే వ్యక్తితో ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పవన్‌కుమార్‌.. రాము ఇంటికి వెళ్లాడు. అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాము ఆవేశంతో కత్తి తీసుకుని పవన్‌కుమార్‌పై దాడికి పాల్పడ్డాడు.

 కత్తిపోట్లకు గురైన పవన్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి శరీరంపై సుమారు 10-12 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మృతుడు పవన్‌కుమార్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.