రెండు రోజుల క్రితం కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదానికి వైసీపీ ఎంఎల్ఏ రోజా కారణం కనిపెట్టేసారు. ఆదివారం రాత్రి ఇబ్రహింపట్నం వద్ద జరిగిన ప్రమాదంలో 22 మంది మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు బూట్లు వేసుకుని కృష్ణా హారతిలో పాల్గొనటమే ప్రమాదం జరగటానికి కారణమట. గతంలో కూడా గోదావరి పుష్కరాల సందర్భంలో షూతోనే పుష్కరస్నానం చేసినట్లు తెలిపారు. అందుకే అప్పుడు కూడా తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారని గుర్తుచేసారు.

ఇప్పటి నుండైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు చంద్రబాబు బూట్లను వదిలేయాలని రోజా సూచించారు. బూట్లు వదిలేయలేకపోతే పూజలు చేయటం మానుకోమన్నారు. పవిత్ర సంగమం చూడటానికి వచ్చిన వారికి కనీస భద్రత కల్పిచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ నిలదీసారు. జరిగిన ప్రమాదాలకు చంద్రబాబు బూటు మహిమే కారణమని తాను అభిప్రాయపడుతున్నట్లు రోజా ఎద్దేవా చేసారు.