Asianet News TeluguAsianet News Telugu

ఎవరు మింగారు, నువ్వా, లోకేశా: చంద్రబాబును ప్రశ్నించిన రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే అన్నీ తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు చేపట్టారని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. 

Roja questions Chandrababu on Amaravati fight
Author
Chittoor, First Published Jan 14, 2020, 12:51 PM IST

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని లక్ష కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని అంటూ అవన్నీ ఎవరు తిన్నారు, నువ్వా, లోకేష్ అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

రాజధానిని మారుస్తానని ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పలేదని, అమరావతితో పాటు మరో రెండు రాజధానులు ఏర్పడుతాయని చెప్పారని ఆమె చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్ాలలు చాలా వెనకబడి ఉన్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఆలోచనలను ప్రజలు, చదువుకున్నవారు స్వాగతిస్తున్నారని అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు స్వాగతించడం లేదని, కోడు గుడ్డుపై ఈకలు పీకిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. 

అమరావతిపై టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఎందుకు ఆందోళనలో పాల్గొనడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని నిజమైన రైతులు గమనించాలని ఆమె కోరారు. అనంతపురం జిల్లా నుంచి లక్షలాది మంది రైతులు వలస పోతున్నారని ఆయన అన్నారు. 

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో జగన్ ప్రకటన చేస్తారని, విభేదాలు తలెత్తకుండా 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ాయన అన్నారు. 

అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలనే చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్ల అన్నీ తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టారని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి అప్పుడే జోలె పట్టి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తేవాల్సిందని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios