తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నస్పెషల్ ట్రైన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లిపోయారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నస్పెషల్ ట్రైన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లిపోయారు. అర్దరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు కడప జిల్లాలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం దొంగలు.. కమలాపురం - ఎర్రగుంట్ల మధ్యలోని ఎర్రగుడిపాడు వద్ద ట్రైన్ ఆపి దిగేశారు. ఈ ఘటనపై మహిళా ప్రయాణికులు.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాయి.
రైలులోని ఎస్ 7 కోచ్‌లో కొందరు మహిళల వద్ద నుంచి బంగారు గొలుసులు చోరీకి గురైనట్టుగా ఫిర్యాదు అందినట్టుగా రైల్వే పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
