గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఉన్న ప్రఖ్యాత సంగం డెయిరీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. చెరుకూరు మండలం కర్నూతలకు చెందిన వ్యక్తి వడ్లమూడి అడ్డరోడ్డు ప్రాంతంలో ఉన్న సంగం డెయిరీలోకి ఆదివారం రాత్రి ప్రవేశించాడు.

వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లిన అతను క్యాష్ కౌంటర్ గది తాళాలు పగులగొట్టి, బీరువాలో ఉన్న రూ.44,43,540 నగదును తస్కరించాడు. జిల్లాలోని పాల సంఘాల నుంచి వచ్చిన నగదును ఆదివారం కావడంతో బ్యాంకులో జమ చేయకపోవడంతో పెద్ద మొత్తంలో నిల్వ ఉంది.

సోమవారం ఉదయం దొంగతనం జరిగినట్లుగా గుర్తించిన క్యాషియర్ మన్నెం గోపి పోలీసులకు సమాచారం అందించారు. డెయిరీ ప్రాంగణంలో సీసీ కెమెరాల నిఘాతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ చోరీ జరగడం పోలీసులకు పలు అనుమానాలు కలిగించింది. క్లూస్ టీం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీని గుర్తించారు. 

సంగం డెయిరీలో రూ. 40 లక్షల నగదు చోరీ