గుంటూరు:గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో బారీ చోరీ జరిగింది. సంగం డెయిరీ చైర్మెన్ దూళిపాల నరేంద్ర క్యాబిన్ లో లాకర్ ను పగులగొట్టి రూ. 44 లక్షలను ఎత్తుకెళ్లారు.

శని, ఆదివారాలు బ్యాంకులో జమచేయాల్సిన నగదును కార్యాలయంలోనే ఉంచారు. సోమవారం నాడు బ్యాంకులో జమ చేసేందుకు లాకర్ వద్దకు వెళ్తే లాకర్ పగులగొట్టి ఉన్నట్టుగా సిబ్బంది గుర్తించారు.  ఈ విషయమై డెయిరీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లాకర్ లో ఉన్న నగదును ఎవరు తీసుకెళ్లారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. డెయిరీ కార్యాలయంలో ఉన్న సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ లాకర్ పగులగొట్టిన కేసులో సిబ్బంది పాత్ర ఉందా... ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

లాకర్ పై ఉన్న వేలిముద్రలను  పోలీసు బృందం సేకరిస్తోంది. చోరీ ఎలా జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.