తాటి ముంజలు కొంటుండగా యాక్సిడెంట్.. తండ్రి, ఇద్దరు చిన్నారులు మృతి, తల్లిపరిస్థితి విషమం..
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాటిముంజలు కొంటుండగా కారు వచ్చి ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
విజయనగరం : రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటుండగా.. రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని కబలించింది. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం గౌరీపురం వద్ద విశాఖ-అరకు రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడకు చెందిన కుటుంబం అరకు నుంచి కారులో తిరిగి వస్తుండగా అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కిల్లో సోనాపతి ఎస్.కోట లో ఉంటున్నారు.
ఆదివారం భార్య పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై శివలింగపురం వెళుతూ మార్గ మధ్యలో తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. అప్పుడే వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన పిల్లలు శ్రవణ్ (7), సుహాస్ (4) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనీ (38) ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఆయన భార్య శ్రావణి తీవ్రగాయాలతో విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వాహనంపై ఉన్న ఎస్ కోట మండలం పెదఖండేపల్లికి చెందిన అప్పారావు, ఆయన తమ్ముడి కుమార్తె సుహిత (5) తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి కోమాలోకి వెళ్ళింది. వీరిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రమాదంపై ఎస్ కోట ఎస్ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోనా పతి, ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోనాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా, ఎప్రిల్ 8న తెలంగాణలోని హనుమకొండలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మరణించిన ముగ్గురు కూడా మహిళా కూలీలు. వారు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పరకాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని పోలీసులు వరంగల్ లో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం మొగుళ్లపల్లి గ్రామంలోని మిర్చితోటలో పనిచేయడానికి వాహనంలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. లారీ వీరి వాహనాన్ని సైడ్ నుంచి తగలడంతో ర్యాలీలో సైడ్ నిలబడిన వారందనికీ గుద్దుకుంటూ వెళ్లింది. అలా మహిళా కూలీలు వాహనంలో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదనికి గురయ్యారు.
సాయంపేట మండలం మందారిపేట వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీలో చికిత్స నిమిత్తం తరలించారు.