విశాఖ జిల్లా కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురు యువకుల్ని ఓ గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. 

మృతి చెందిన యువకులు బుచ్చయ్య పేట మండలం శివరామపురం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతులలో నాగేశ్వర రావు(33), సతీష్, నాగ అప్పారావు(28) ఉన్నారు. నమ్మి వేముళ్ళు అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించాయారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న కశింకోట ఎస్సై హిమగిరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారులపై తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.