గుంటూరు జిల్లా మాచర్లలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా ఉన్న వాహనాన్ని గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.
మాచర్ల : family membersతో వారంతా శివుడి దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో వారంతా happyగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దుల్లోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారి ఇంటి వద్ద దిగి పోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. నెత్తురోడుతూ హాహాకారాలు.. చిమ్మ చీకట్లో రక్షించండి.. అని ఆర్తనాదాలు.. ఆదివారం అర్ధరాత్రి Rentacintala రహదారి ఈ భయానక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది.
రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరుకు రవాణా చేసే టాటా ఏస్ వాహనంతో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న వీరి వాహనం రెంటచింతల పొలిమేరలోకి రాగానే స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. వాహనం పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు.
ప్రమాదానికి కారణం అదే..
మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు అక్కడే ఆగి ఉన్న వాహనాలు కనిపించవు. దీంతో రహదారిపై ప్రయాణం చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ నిత్యం తిరిగే రహదారి అనే నిర్లక్ష్యంతో వేగంగా దూసుకెళ్ళాడు. రహదారిపై ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. క్షతగాత్రులను 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, తీవ్ర గాయాలైన మరో ఇద్దరు గురజాల ఆస్పత్రిలో చనిపోయారు. ఆ తరువాత మరొకరు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులు అందరిని గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదిలా ఉండగా, మే 27న Siddipet జిల్లా జగదేవ్పూర్ మండలం అలీ రాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఘోర road accident జరిగింది. జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలు మెదక్ వెళ్తోంది. ఆటోకి ఎదురుగా వస్తున్న లారీ alirajpet వద్ద ఢీకొంది. ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు. మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవ్పూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇక, 26నాడు ఏపీలోని మదనపల్లెలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు కల్వర్టును ఢీకొనడంతో.. కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
క్రిష్ణాజిల్లాలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెడితే.. చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు బయలుదేరింది. అయితే, వారు ప్రయాణిస్తున్న వాహనం.. మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.
