ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రోడ్డు ప్రమాదరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ : మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం. కల్వర్టును ఢీకొన్న కారు. నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 16న అన్నమయ్య జిల్లా కురబలకోట మంలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిమీద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కటుంబానికి చెందిన నలుగురు మదరనల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెల్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోసట్ుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఠాణామిట్ట వద్ద వర్షంలో రోడ్డును క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. లారీ ఢీ కొట్టడంతో బైక్ మీద వెడుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందినట్లు వివరించారు. కాగా, ఈ ఘటనలో బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. మృతదేహాలు కూడా రోడ్డు మీద చెల్లా చెదురుగా పడ్డాయి.
