చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు వద్ద విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్యాంకర్ డీ కొట్టడంతో పది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. అనంతపురంలోని ఓ ప్రవేటు స్కూల్ కు చెందిన వీరు కొడైకెనాల్ నుండి విహారయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

వారికి ఆడి కార్లు, బంగారు గాజులు ఎలా వచ్చాయి.. అదంతా వాళ్ళ పనే: పృథ్వీ

తెల్లవారుజాము కావడం దట్టమైన పొగమంచు రొడ్డును కప్పి వేయడంతో బస్సును ఓవర్ ట్యాక్ చేయబోయిన ట్యాంకర్ డీ కొన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై పలమనేరు పోలీసులు విచారణ చేపట్టారు.

  ప్రస్తుతం గాయపడిన విద్యార్థులు అందరూ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.  బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు అనంతపురం వికాస్ మోడల్ స్కూల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు హుటాహుటిన ప్రమాద స్ధలికి చేరుకుంటున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా  ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగితా వారికి ఎలాంటి ప్రమాదం  లేదని వివరించారు. 

Video : అక్రమ మద్యాన్ని అడ్డుకోవడానికి పోతే..పోలీసుకు తీవ్ర గాయాలు...