భక్తులతో గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ని వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ లోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ని వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 20 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీడియో

ప్రమాదంలో గాయపడినవారంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను108 వాహనాలలో ఏరియా హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా వున్నవారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.