పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ముగ్గురు ప్రభుత్వోద్యులు మృతిచెందారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే శేఖర్, ఉండ్రాజవరం మండలం వెలుగు శాఖలో సిసి గా పని చేసే నాగ సుభాషిణి, తణుకు రవాణా శాఖలో పని చేసే శ్రీనివాసరావు లు భీమవరం నుంచి తణుకుకు బయలుదేరారు. ప్రతిరోజూ వేరువేరుగా తమ వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వీరు వర్షం పడుతుండటంతో ఓ కారులో కలిసి బయలుదేరారు. ఇదే వీరి మృతికి కారణమయ్యింది.

read more   సెల్పీ సరదా... అమెరికాలో తెలుగు యువతి బలి (వీడియో)

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులూ అక్కడికక్కడే మృతిచెందారు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అలాగే ఈ ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం  అందించారు. దీంతో పొద్దున ఆఫీసుకు వెళ్లివస్తామని చెప్పిన వారు ఇప్పుడు విగతజీవులుగా ఇంటికి తిరిగివస్తుండటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. 

"