విజయనగరం మాజీ ఎంపి బొత్స ఝాన్సి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ చిన్నారి బాలుడు మృత్యువాతపడ్డారు. ఎప్పుడూ రద్దీగా వుండే జాతీయ రహదారిపై రోడ్డు దాటే క్రమంలో వేగంగా వెళుతున్న మాజీ ఎంపి కారు చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రంగా గాయపడిని చిన్నారి మూడు రెండు రోజులుగా చికిత్స పొందుతూ చిన్నారి చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారిని ఎలాంటి రక్షణ లేకుండా నిర్మించారు. అండర్ పాస్ లాంటి సదుపాయం కల్పించకపోవడంతో గ్రామస్ధులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జాతీయ రహదారిని దాటే పరిస్థితి ఏర్పడింది. ఇలా రోడ్డు దాటే క్రమంలో అనేకమంది ప్రాణాలు వదిలారు.  

విజయ నగరం మాజీ ఎంపి బొత్స ఝాన్సి గత బుధవారం కారులో ఈ జాతీయ రహదారి గుండా ప్రయాణించారు. ఈ క్రమంలోనే తామరాపల్లికి చెందిన ఎ.రోహిత్ అనే విద్యార్థి స్కూల్ నుండి ఇంటికి వెళుతూ ఒంటిరిగానే రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఇలా బాలుడు వేగంగా వస్తున్న బొత్స కారుకు అడ్డువచ్చి ప్రమాదంబారిన పడ్డాడు.   

అయితే తీవ్రంగా గాయపడిన రోహిత్ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ  మృతిచెందాడు. ఈ వార్త తెలిసి తామరావల్లి గ్రామస్థులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన జాతీయ రహదారిని దిగ్బందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్థులను సముదాయించినా వినిపించుకోకుండా ధర్నాను కొనసాగించారు. ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే వరకు ధర్నా కొనసాగిస్తామని గ్రామస్థులు వెల్లడించారు.