ప్రకాశం: వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు చనిపోవడమే కాదు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 30 గొర్రెలు కూడా మృతిచెందాయి. ఈ రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని త్రిపురాంతకం మండలం ముడివేముల వద్ద లారీ బోల్తాపడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు  సమాచారం అందించగా వారు సంఘటనా  స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ముందుగా గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి వైద్యం అందేలా చూశారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగివుంటుందని అనుమానిస్తున్నామన్నారు.