కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నేషనల్ హైవేపై ఎదురెదురుగా వచ్చిన లారీ, ఆటో డీకొన్నారు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు వున్నారు. వీరందరూ తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో గాయపడిని వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలించారు. ఇందులో ఒ చిన్నారి కూడా వున్నట్లు తెలుస్తోంది. 

read more   సుశాంత్ సూసైడ్: భరించలేక తెలుగు అభిమాని ఆత్మహత్య

డోన్ పక్కన మల్లంపల్లె గ్రామానికి చెందిన పొదుపు గ్రూపు మహిళలు ఆటోలు బ్యాంక్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారందరు మహిళలే వుండగా అందులో ఓ చిన్నారి కూడా వుంది. వీరంతా తీవ్ర గాయాలతో పడివుండటాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు తెలుస్తోంది.